: తొలిసారి తన కుటుంబ సభ్యుల ఫొటో పోస్ట్ చేసిన హీరో రవితేజ.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్ !
గత ఏడాది సినిమా షూటింగ్లకు కాస్త దూరంగా ఉంటూ మాస్ మహారాజా రవితేజ తన కుటుంబంతో జాలీగా గడిపాడు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. అయితే రవితేజ తాజాగా తన కుటుంబానికి సంబంధించిన ఓ ఫొటోను తన ఫేస్బుక్ ఖాతాలో ఉంచి తన అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇంతవరకు రవితేజ కుటుంబ సభ్యులని చూసే అవకాశం ఆయన ఫ్యాన్స్ కి రాలేదు. రవితేజ ఇద్దరు తమ్ముళ్ళు భరత్, రఘులు మాత్రమే ఆయన అభిమానులకు బాగా తెలుసు.
అయితే, తాజాగా మాస్ మహారాజా తన భార్య కల్యాణి తేజతో పాటు కొడుకు మహాదన్, కుమార్తె మోక్షదలతో కలిసి సెల్ఫీ దిగి, ఆ ఫొటోను తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోకు ఆయన అభిమానుల నుంచి ఎంతో స్పందన వస్తోంది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తన కుటుంబ సభ్యులతో కలిసి చిరునవ్వులు చిందిస్తూ రవితేజ స్వయంగా ఈ సెల్ఫీ తీశాడు.