: కాసేపట్లో కిమ్స్ హాస్పిటల్ కు రానున్న జగన్
వైసీపీ అధినేత జగన్ కాసేపట్లో హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రికి రానున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావును ఆయన పరామర్శించనున్నారు. ఊపిరితిత్తులు, అన్నవాహిక, మూత్రపిండాల సమస్యతో దాసరి బాధపడుతున్న సంగతి తెలిసిందే. నిన్ననే ఆయనకు ఒక ఆపరేషన్ నిర్వహించారు. మరోవైపు దాసరికి సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి.