: రాంగోపాల్ వర్మ అంటే నాకు చాలా ఇష్టం.. మనసులో ఏదీ దాచుకోడు!: నాగార్జున!


తన ట్వీట్లతో వేడి పుట్టించడం ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అత్యంత ఇష్టమైన పని అని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీపై ఆయన సంధిస్తున్న ట్వీట్లు సంచలనంగా మారుతున్నాయి. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు ఇలా ఎవర్నీ వదల్లేదు వర్మ. చివరకు మిస్టర్ కూల్ మహేష్ బాబుపై కూడా ట్వీట్ చేశాడు. అతని ట్వీట్లపై మెగా అభిమానులు ఇప్పటికే అనేకసార్లు మండిపడ్డారు. అయినా, వర్మ మాత్రం తగ్గడం లేదు.

ఈ నేపథ్యంలో, వర్మ ట్వీట్లపై ప్రముఖ నటుడు నాగార్జున స్పందించాడు. వర్మపై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుందని... కానీ, తనకు మాత్రం వర్మ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. వర్మపై తనకు అంతులేని ప్రేమ ఉందని తెలిపాడు. ఆ ప్రేమ ఎన్నటికీ చావదని అన్నాడు. మనసులో ఏది ఉంటే దాన్ని బయటకు చెప్పేయడం వర్మకు అలవాటని... ఆ ట్వీట్ల గురించి బాధపడుతున్నవారు, వాటిని పట్టించుకోకపోవడమే మేలని తెలిపాడు. 

  • Loading...

More Telugu News