: అరుణ్ జైట్లీ బడ్జెట్ ముఖ్యాంశాలు - 1
2017-18 సాధారణ వార్షిక బడ్జెట్ తో పాటే రైల్వే బడ్జెట్ నూ కలిపి రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ ముందుంచారు. జైట్లీ పద్దులోని ముఖ్యాంశాలివి.
* రైల్వే, సాధారణ బడ్జెట్ లను విలీనం చేయడం చారిత్రాత్మకం
* యువత ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్ ఉంటుంది.
* ఈ సంవత్సరం స్థూల ఆర్థిక వృద్ధి పెరుగుతుంది.
* నోట్ల రద్దు వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.
* సమీప భవిష్యత్తులో వృద్ధి రేటు మరింతగా పెరుగుతుంది.
* ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి.
* నల్లధనాన్ని అరికట్టడంలో తొలి అడుగులు పడ్డాయి. మరిన్ని నిర్ణయాలు తీసుకుంటాం.
* పెట్టుబడులను పెంచుతూ, వృద్ధికి సహకరించేలా సంస్కరణలు తీసుకొస్తాం.
* ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఇంకా ఎంతో చేయాలి.
* బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ వీలును కల్పించింది.
* విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితులను సవరించాం.
* గ్రామీణ, మౌలిక వసతులు, పేదరిక నిర్మూలనపై నిధులు పెంచుతాం.
* ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యేలోపు సమయం వృథా కారాదనే నెలముందే బడ్జెట్.
* 'టెక్ ఇండియా' మా సరికొత్త నినాదం.
* నిజాయతీగా పన్నులు చెల్లించే వారికి వేధింపులు ఉండవు.
* వ్యవసాయ రంగం ఈ సంవత్సరం 4.1 శాతం వృద్ధి చెందుతుంది.
* రైతులకు రూ. 10 లక్షల కోట్ల రుణాలిస్తాం.
* నాబార్డుతో సహకార బ్యాంకుల అనుసంధానం.
* ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకాశ్మీర్ లో రైతులకు 60 రోజుల వడ్డీ రుణ మాఫీ.
* 2017-18కి ఆర్థిక వృద్ధి 7.2 నుంచి 7.7 శాతానికి పెరుగుతుంది.
* రూ. 800 కోట్లతో డెయిరీ అభివృద్ధికి సరికొత్త నిధి.
* ప్రతి కృషి విజ్ఞాన కేంద్రంలో భూసార పరీక్షకు ఏర్పాట్లు
* ఉపాధిహామీ పథకానికి రికార్డు స్థాయిలో రూ. 48 వేల కోట్లు.
* సాగు నీటి కోసం రూ. 40 వేల కోట్లతో కార్పస్ ఫండ్.
* గ్రామీణాభివృద్ధి నిమిత్తం రూ. 3 లక్షల కోట్లు.
* వ్యవసాయ పనులకు కూడా ఉపాధి హామీ పథకం నిధుల కేటాయింపు.
* గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం కోసం రూ. 19 వేల కోట్లు.
* ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు రూ. 23 వేల కోట్లు.
* ఈనామ్ లు రూ. 240 నుంచి రూ. 500కు పెంపు.
* 2019 నాటికి కోటి ఇళ్ల నిర్మాణం ప్రభుత్వ లక్ష్యం.
* గృహ నిర్మాణంలో గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యత.
* దీన్ దయాళ్ గ్రామజ్యోతి యోజనకు రూ. 4,300 కోట్ల కేటాయింపు.
* సురక్షిత మంచినీటిని అందించేందుకు ఐదు లక్షల మందికి శిక్షణ.
* గ్రామీణాభివృద్ధికి, వ్యవసాయానికి రూ. 1,87,223 కోట్లు.