: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున ఆలయ దర్శన వేళల్లో మార్పులు
ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయం దర్శన వేళల్లో మార్పులు చేశారు. ఉదయం 5.30 నుంచి స్వామి, అమ్మవార్ల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. ఉదయం 6.30 నుంచి అభిషేకాలు నిర్వహిస్తారు. ఇవి ఈ రోజు నుంచే అమల్లోకి వస్తాయని ఆలయ ఈవో భరత్ గుప్తా తెలిపారు.