: తొలిపోటీ శశికళతోనే... ఆర్కే నగర్ తనదేనంటున్న జయలలిత మేనకోడలు దీప... ఉప ఎన్నికల బరిలోకి!


దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసురాలిని తానేనని ప్రకటించుకుని రాజకీయాల్లోకి వస్తున్నట్టు స్పష్టం చేసిన ఆమె మేనకోడలు దీపా జయకుమార్ జయ నియోజకవర్గం, చెన్నై పరిధిలోని ఆర్కే నగర్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. ఇక్కడి నుంచి పోటీకి దిగడం ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని భావిస్తున్న జయ నెచ్చెలి శశికళను తాను ఓడిస్తానని దీప అన్నారు. దీప మీడియాతో మాట్లాడుతున్న వేళ, ఆర్కే నగర్ నుంచి శశికళ పోటీకి దిగితే ఏం చేస్తారని ప్రశ్నించగా ఆమె సమాధానం ఇచ్చారు.

నాలుగు గోడల మధ్య తీసుకునే నిర్ణయాలు సరిపోవని, ఎవరికి ఓటు వేసి గెలిపించాలన్నది ఆర్కే నగర్ ప్రజల నిర్ణయమని అన్నారు. ఇక్కడ గెలవడం ద్వారా ప్రజల్లో జయ వారసురాలిగా తానే ఉన్నానన్న సంకేతాలను రాష్ట్రమంతటికీ పంపాలని దీప భావిస్తున్నట్టు ఆమె అనుయాయులు వెల్లడించారు. కాగా, దీప ప్రకటనతో శశికళ వర్గం అప్రమత్తమై ఆమెకున్న బలం, ఆమె వెనుక ఎవరెవరు ఉన్నారన్న విషయమై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News