: ట్రంప్.. దయ చూపుతారా! నా కుమారుడికి చికిత్స అందుతుందా?: సిరియా తండ్రి ఆవేదన


ఏడు ముస్లిం దేశాలకు చెందిన వారిని అమెరికాలోకి ప్రవేశించనీయకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ఆదేశాలు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడు దేశాల జాబితాలో సిరియా కూడా ఉంది. దీంతో, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తన కుమారుడికి అమెరికాలో చికిత్స అందించడం ఎలా? అని సిరియాకు చెందిన ఓ తండ్రి ఆవేదన
వ్యక్తం చేస్తున్నాడు. సిరియాకు చెందిన జిహార్ అల్ ఖలేదు కుమారుడు ఏడేళ్ల మహమ్మద్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లాల్సి ఉంది.

కానీ, ట్రంప్ తాజా ఆదేశాలు ఇందుకు అడ్డుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మహమ్మద్ తండ్రి జిహాద్ అల్ ఖలేద్ మీడియాతో మాట్లాడుతూ, తన కుమారుడి విషయంలో ట్రంప్ కు దయ కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానని గద్గద స్వరంతో తెలిపారు. ట్రంప్ దయ చూపితే, తన బిడ్డకు సకాలంలో చికిత్స అందించేందుకు అవకాశాలుంటాయని అన్నారు. తన కొడుకుకి సంబంధించిన మెడికల్ రిపోర్టులను పలు దౌత్య కార్యాలయాలకు పంపగా, అమెరికా మాత్రమే స్పందించిందన్నారు. కానీ, ఆ దేశానికి తన బిడ్డను తీసుకువెళ్లేందుకు ట్రంప్ తాజా ఆదేశాలు అడ్డుపడుతున్నాయని వాపోయారు.

  • Loading...

More Telugu News