: జల్లికట్టు చట్టంపై స్టేకు సుప్రీం నిరాకరణ!


తమిళనాడు ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన కొత్త జల్లికట్టు చట్టంపై 'స్టే' ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. అంతే కాకుండా జల్లికట్టుకు సంబంధించి మద్రాసు హైకోర్టుకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేయలేదు. అదే సమయంలో జల్లికట్టుపై తయారు చేసిన కొత్త చట్టం గురించి ఆరు వారాల్లోగా తమకు వివరాలు ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. తాజాగా చెన్నయ్ మెరీనా బీచ్ లో జల్లికట్టు నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న ఆందోళనల సమయంలో శాంతి భద్రతల పరిస్థితులను సక్రమంగా పట్టించుకోలేదంటూ తమిళనాడు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. అంతే కాకుండా 2016 నోటిఫికేషన్‌ ను కేంద్రం వెనక్కు తీసుకునేందుకు కూడా సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. దీంతో 'జల్లికట్టు'పై తమిళుల పోరాటం విజయం సాధించింది. 

  • Loading...

More Telugu News