: కస్టమ్స్ అధికారుల కంటపడ్డ కాళ్ల కింద బంగారం!


స్మగ్లర్లు తెలివిమీరిపోతున్నారు. కస్టమ్స్ అధికారులు క్షణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తుండడంతో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ బంగారం తరలిస్తున్నారు. తాజాగా, హైదరాబాదు, శంషాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వినూత్న రీతిలో బంగారం తరలిస్తున్న ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జెద్దా నుంచి హైదరాబాద్‌ చేరుకున్న వీరిద్దరు సామాన్లలో బంగారం తరలిస్తే దొరికిపోయే ప్రమాదముందని గుర్తించి, కాళ్లకింద అరికాలికి బంగారం బిస్కట్లను అంటించుకుని, ఆపై సాక్స్ తొడుక్కుని 1100 గ్రాముల బంగారాన్ని తరలిస్తూ పట్టుబడ్డారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ బహిరంగ మార్కెట్లో 32 లక్షల రూపాయలుంటుందని చెప్పారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న రూ.32 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News