: ట్రంప్ వీసా నిర్ణయంతో కుదేలైన భారత ఐటీ కంపెనీలు!
హెచ్1-బీ వీసాల జారీని మరింత కఠినతరం చేస్తూ, ప్రతినిధుల సభకు ట్రంప్ బిల్లును పంపారన్న వార్త, నేటి స్టాక్ మార్కెట్ సెషన్ లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను తీవ్రంగా దెబ్బతీసింది. ఐటీ, టెక్ కంపెనీల వాటాలను విక్రయించేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దీంతో బీఎస్ఈ ఐటీ ఇండస్ట్రీ భారీగా నష్టపోయింది. ఈ మధ్యాహ్నం 1:20 గంటల సమయంలో టెక్ మహీంద్రా 5 శాతం, ట్రైజన్ 4.98 శాతం, టీసీఎస్ 4.42 శాతం, మైండ్ ట్రీ 3.95 శాతం, ఎంఫసిస్ 3.72 శాతం, న్యూక్లియస్ 3.31 శాతం, హెచ్సీఎల్ టెక్ 2.98 శాతం, ఇన్ఫోసిస్ 2.98 శాతం, హెక్సావేర్ 2.85 శాతం, సుబెక్స్ 2.58 శాతం, పోలారిస్ 2.41 శాతం, విప్రో 2.4 శాతం జియోమెట్రిక్ 2.07 శాతం నష్టపోయాయి. ప్రస్తుతం బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక క్రితం ముగింపుతో పోలిస్తే 124 పాయింట్ల నష్టంతో 27,724 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి 8,581.95 పాయింట్ల వద్ద ఉంది.