: మోదీతో స్నేహం కోసం అర్రులు చాస్తున్న ట్రంప్: నిప్పులు చెరిగిన ఉగ్ర నేత హఫీజ్ సయీద్


భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో స్నేహం కోసం అర్రులు చాస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పాకిస్థాన్ ను దూరం చేసుకుంటున్నాడని, తనను హౌస్ అరెస్ట్ చేయాలని పాక్ ప్రభుత్వంపై ఆయనే ఒత్తిడి తెచ్చాడని లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఆరోపించాడు. తనను గృహ నిర్బంధంలో ఉంచిన తరువాత, ఓ వీడియోను విడుదల చేస్తూ, మోదీతో స్నేహాన్ని బలోపేతం చేసుకునేందుకే ట్రంప్ ఈ రకమైన ఒత్తిడి తెస్తున్నాడని విమర్శించాడు. అమెరికాను, ఇండియాను తృప్తి పరిచేందుకు దేశ భక్తులమైన తమపై ప్రభుత్వం చర్యలకు దిగుతోందని అన్నాడు. తమ కార్యాలయాల వద్ద భారీ ఎత్తున సైనిక బలగాలను మోహరించి భయాందోళనలకు గురి చేస్తోందని పాక్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగాడు.

  • Loading...

More Telugu News