: పలుమార్లు మొరాయించిన మైకును చూసి రాష్ట్రపతి అసహనం!


ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తున్న వేళ, మైకులు మొరాయించడం సభ్యులతో పాటు రాష్ట్రపతికీ అసహనాన్ని కలిగించింది. ఆయన మాట్లాడుతుండగా, మైకుల నుంచి 'గుయ్య్...' మని శబ్దం పలుమార్లు వచ్చింది. దీంతో చెవులకు ఇయర్ ఫోన్స్ తగిలించుకుని ప్రణబ్ ప్రసంగాన్ని వింటున్న వాళ్లంతా వాటిని పక్కకు తొలగించాల్సి వచ్చింది. ఆపై మరోసారి కూడా ఇలాగే జరిగింది. ఆ సమయంలో ప్రణబ్ అసహనంగా మైక్ సెట్ నిర్వాహకుల వైపు చూశారు. ప్రణబ్ ప్రసంగాన్ని ఆపకుండా కొనసాగించగా, ఆపై కాసేపటికి సమస్య సద్దుమణిగింది.

  • Loading...

More Telugu News