: 130 మంది భార్యల ముద్దుల భర్త, 203 మంది పిల్లల తండ్రి మృతి!
అనారోగ్య కారణంతో నైజీరియాలోని బిడా రాష్ట్ర వాసి, వివాదాస్పద మతబోధకుడు మొహమ్మద్ బెలో అబూ బకర్ కన్ను మూశారు. ఒక పురుషుడు ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చని గట్టిగా వాదించే ఆయనకు 130 మంది భార్యలు, 203 మంది పిల్లలు ఉన్నారు. గత కొంత కాలంగా ఆయన అంతుచిక్కని వ్యాధితో బాధపడుతూ తుదిశ్వాస విడిచారని ఆయన సహాయకులు పేర్కొన్నారు. అక్కడి వాసులు ఆయనను ‘బాబా’గా భావిస్తారు. ఆయన రెండంతస్తుల భారీ భవనంలో నివసిస్తారు. ప్రంపంచంలోనే అతిపెద్ద కుటుంబంగా ఆయన ఫ్యామిలీ రికార్డు సొంతం చేసుకుంది. ఆయన భార్యల్లో కొంతమంది గర్భవతులు ఉన్నారు.
2008లో ఆయన కేవలం రెండు గంటల వ్యవధిలోనే 82 మంది భార్యలకు విడాకులు ఇచ్చి వార్తల్లోకెక్కారు. అయితే, ఒకేసారి అంతమందికి ఆయన విడాకులు ఇవ్వడాన్ని ఇతర మతపెద్దలు ఖండించారు. మొహమ్మద్ బెలో అబూ బకర్ మాత్రం భగవంతుడి ఆదేశాలను పాటించడానికే తాను జన్మించానని అంటుంటాడు. కొన్నిరోజుల క్రితం తన సహాయకులతో తనకు దేవుడు అప్పగించిన పని ముగిసిందని ఆయన వ్యాఖ్యానించాడట.