: 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి సుబ్బరామిరెడ్డి గ్రాండ్ పార్టీ.. బాలయ్య ఫ్యామిలీ సందడి!
నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా అఖండ విజయం సాధించింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని ప్రముఖ సినీ నిర్మాత, రాజకీయవేత్త, వ్యాపారవేత్త టి.సుబ్బరామిరెడ్డి నిన్న సాయంత్రం గ్రాండ్ పార్టీ ఇచ్చారు. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఈ పార్టీ జరిగింది. ఈ పార్టీకి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. బాలయ్య కుటుంబం ఈ పార్టీలో హైలైట్ గా నిలిచింది. భార్య వసుంధర, కుమార్తెలు బ్రాహ్మిణి, తేజస్వినిలతో కలసి బాలయ్య వచ్చారు. ఈ సందర్భంగా బాలయ్య కుటుంబసభ్యులు మాట్లాడుతూ, 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా చూసి తామంతా గర్వపడుతున్నామని చెప్పారు. ఈ పార్టీకి దర్శకుడు క్రిష్ తన భార్య రమ్యతో కలసి వచ్చాడు.