: దేశ చరిత్రలో ఇదో చారిత్రాత్మక సమయమని కచ్చితంగా చెప్పగలను: రాష్ట్రపతి ప్రణబ్
స్వతంత్ర భారతావనిలో తొలిసారిగా సాధారణ బడ్జెట్ తో కలిపి రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టడాన్ని మారుతున్న చరిత్ర, అభివృద్ధికి సూచికగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభివర్ణించారు. కొద్దిసేపటి క్రితం పార్లమెంటుకు వచ్చిన ఆయన, ఉభయ సభలను ఉద్దేశించి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశ చరిత్రలో ఈ బడ్జెట్ సమావేశాలు ఓ కొత్త చరిత్రను లిఖించనున్నాయని ఆయన అన్నారు. 'సబ్ కే సాథ్... సబ్ కా వికాస్' నినాదంతో దేశం ముందడుగు వేస్తోందని అన్నారు.
" సహనా వవతు సహనౌ భునక్తు..." సూక్తాన్ని చదివారు. గురు గోవింద సింగ్ 350వ జయంతి ఉత్సవాలను, రామానందాచార్య సహస్ర జయంతి వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న వేళ, బ్రిటీష్ పాలకులు ఏర్పాటు చేసిన ఒక్కో సంప్రదాయాన్ని వీడి అత్యుత్తమ ప్రజాస్వామ్య దేశంగా భారతావని పరిఢవిల్లుతోందని అన్నారు. ఇప్పటికీ కొన్ని వలస పాలకుల విధానాలను పాటించడం దేశ సార్వభౌమత్వానికి మచ్చగా ఉందని, ఆ మచ్చను తుడిచేయాల్సిన సమయం వచ్చిందని ప్రణబ్ అభిప్రాయపడ్డారు. ప్రణబ్ ముఖర్జీ ప్రసంగం కొనసాగుతోంది.