: మరో బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చిన రాధికా ఆప్టే!


ఈ తరం సినీ హీరోయిన్లు అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. పైగా యూత్ లో తమకు బోలెడంత క్రేజ్ వస్తుందనే భావనలో వారు ఉన్నారు. ఇక బాలీవుడ్ భామలైతే హాలీవుడ్ హీరోయిన్లతో పోటీ పడే స్థాయికి చేరుకున్నారు. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన రాధికా ఆప్టే కూడా ఇదే భావనతో ఉంది. హిందీ సినిమా 'పార్చ్ డ్'లో ఏకంగా నగ్నంగా కనిపించి జనాలకు షాక్ ఇచ్చింది రాధిక. అంతకు ముందు ఓ బెంగాలీ షార్ట్ ఫిల్మ్ లో అర్ధనగ్నంగా కనిపించింది.

తాను చేసే క్యారెక్టర్ల గురించి బోల్డ్ గా మాట్లాడటం రాధికా ఆప్టే స్పెషాలిటీ. తాజాగా ఆమె మరో సంచలన వ్యాఖ్య చేసింది. కథతో సంబంధం ఉంటేనే అర్ధనగ్నంగా నటించడానికి తాను ఇష్టపడతానని చెప్పింది. స్టోరీ డిమాండ్ చేస్తే నగ్నంగా నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. నగ్నంగా నటించడం పట్ల తన భర్త కూడా అభ్యంతరం వ్యక్తం చేయడని... పైగా ప్రోత్సహిస్తాడని చెప్పింది. రాధికా ఆప్టే ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ జనాల మతులు పోగొడుతోంది. 

  • Loading...

More Telugu News