: జీవిత ఖైదు వేయిస్తారో, ఉరి శిక్ష వేయిస్తారో మీకు చేతనైన పని చేయండి: ముద్రగడ పద్మనాభం సవాల్
తుని ఘటనకు సంబంధించి అక్రమంగా పెట్టిన కేసులపై విచారణ చేయాలని, అధికారంతో పాటు, చట్టం కూడా వారి చేతుల్లోనే ఉంది కనుక, తనకు జీవిత ఖైదు వేయిస్తారో, ఉరిశిక్ష వేయిస్తారో చేతనైన పని చేసుకోవచ్చంటూ టీడీపీ ప్రభుత్వానికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. 'తప్పు చేస్తే భయపడాలి. చేయనప్పుడు ఎందుకు భయపడాలి? కాపు జాతికి ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలి' అంటూ ఆయన డిమాండ్ చేశారు. తాను జైలులో ఉన్నా, బయట ఉన్నా తన ఉద్యమం మాత్రం ఆగదని స్పష్టం చేశారు. అవసరమైతే, తాను మంత్రిగా పని చేసిన కాలంలో తాను తీసుకున్న నిర్ణయాలపై కూడా విచారణ జరిపించుకోవచ్చని అన్నారు.