: ప్రత్యేక ప్యాకేజ్ చట్టబద్ధతకు కేంద్రంపై ఒత్తిడి పెంచండి: సీఎం చంద్రబాబు


ఏపీ ప్రత్యేక ప్యాకేజ్ కు చట్టబద్ధత కల్పించే విషయమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో టీడీపీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ పై చట్టబద్ధత కల్పించే అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రస్తావించాలని ఈ మేరకు తీర్మానం చేశారు.  ఈ విషయంలో కేంద్రం జాప్యం చేస్తోందని పలువురు ఎంపీలు ఆరోపించారు. విశాఖ రైల్వేజోన్, డి-లిమిటేషన్, విభజన అంశాల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని తమ పార్టీ ఎంపీలకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది.  

  • Loading...

More Telugu News