: భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌ల‌హీనంగా ఉంది: మ‌న్మోహ‌న్ సింగ్‌


భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌ల‌హీనంగా ఉంద‌ని భార‌త మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్ అన్నారు. ఈ రోజు ఢిల్లీలో కేంద్ర‌ మాజీ ఆర్థిక మంత్రి చిద‌ంబ‌రంతో క‌లిసి ఆయ‌న ఓ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ... మ‌న‌దేశ‌ ఆర్థిక వ్య‌వ‌స్థ స‌రైన స్థితిలో లేద‌ని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిదంబ‌రం మాట్లాడుతూ.. దేశ‌ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై పూర్తి స‌మాచారంతో తాము డాక్యుమెంట్‌ను త‌యారు చేశామ‌ని చెప్పారు. ప‌రిశోధ‌న‌ల ఆధారంగా దాన్ని రూపొందించిన‌ట్లు చెప్పారు. భార‌త్‌లో కొత్త ఉద్యోగాలు, పెట్టుబ‌డులు ఎక్క‌డ ఉన్నాయని ఆయ‌న నిల‌దీశారు. స‌ర్కారులు పాజిటివ్ దృక్ప‌థంతోనే ఉండాల‌ని, అయితే, నిజ‌మైన ప‌రిస్థితి ఆధారంగా బ‌డ్జెట్ అంచ‌నాలు చేయాల‌ని ఆయ‌న సూచించారు. తాము తాజాగా రూపొందించిన ఈ డాక్యుమెంట్‌ కేంద్ర బ‌డ్జెట్‌ను పోలి ఉంటుంద‌ని ఆయ‌న చెప్పారు.

  • Loading...

More Telugu News