: చై అక్కినేని -సమంతాకు కంగ్రాట్స్: పివి సింధు
సినీ ప్రేమ జంట నాగ చైతన్య- సమంతా నిశ్చితార్థం నిన్న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, రియో ఒలింపిక్స్ రజత పతక గ్రహీత పి.వి. సింధు ఒక ట్వీట్ చేసింది. సమంతా ప్రభు, చై - అక్కినేని జంటకు కంగ్రాట్యులేషన్స్ అని సింధు పేర్కొంది. కాగా, సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేతగా నిలిచిన సింధుకు పలువురు కృతఙ్ఞతలు తెలిపారు.