: ట్రంప్ దెబ్బకు పైలట్లను మార్చిన ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్!


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానాలు పైలెట్లను మార్చాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఎమిరేట్స్ విమానయాన సంస్థలో వివిధ ముస్లిం దేశాలకు చెందిన పైలట్లు పని చేస్తున్నారు. అమెరికాలోని వివిధ నగరాలకు ఎమిరేట్స్ మొత్తం 11 విమానాలను నడుపుతోంది. వివిధ దేశాలకు చెందిన ముస్లింల ప్రవేశాన్ని ట్రంప్ నిషేధించిన నేపథ్యంలో ఎమిరేట్స్ విమానయాన సంస్థ కూడా వారిని అక్కడి నుంచి బదిలీ చేసింది. ట్రంప్ ఆదేశాలు అమలు చేస్తూ విమానాలు నడుపుతున్నామని ఎమిరేట్స్ సంస్థ ప్రకటించింది. ఇదే బాటలో ఇతర విమానయాన సంస్థలు కూడా నడుస్తున్నట్టు తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News