: బాలయ్య కోసం భారీ పార్టీ ఇస్తున్న టి.సుబ్బరామిరెడ్డి
ప్రముఖ సినీ నిర్మాత, రాజకీయవేత్త టి.సుబ్బరామిరెడ్డికి టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులతో ఉన్న సంబంధాలు అందరికీ తెలిసిందే. సినీ పరిశ్రమలో భారీ పార్టీలు, సన్మానాలకు ఆయనను కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' ఘన విజయం సాధించిన నేపథ్యంలో, ఓ భారీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించిన సంగతి తెలిసిందే.
తాజాగా 'గౌతమీపుత్ర శాతకర్ణి' సూపర్ హిట్ ను పురస్కరించుకుని ఈ సాయంత్రం ఆయన మరో భారీ పార్టీ ఇస్తున్నారు. హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో ఈ వేడుక జరుగనుంది. ఈ కార్యక్రమంలో 100 చిత్రాలు పూర్తి చేసుకున్న బాలయ్యను ఘనంగా సన్మానించనున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమం వారం కిందటే జరగాలట. అయితే, సుబ్బరామిరెడ్డి మనవడి పెళ్లి ఉండటం, బాలయ్య అమెరికా పర్యటనలో ఉండటంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఈ సాయంత్రం జరగనున్న కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నట్టు సమాచారం.