: నా మీద వచ్చినన్ని పుకార్లు మరెవరి మీద వచ్చుండవు: అమలాపాల్


సినీ పరిశ్రమలో తనపై వచ్చినన్ని పుకార్లు మరెవరి మీద వచ్చుండవని హీరోయిన్ అమలాపాల్ వాపోయింది. తన పెళ్లి జరిగినప్పటి నుంచి విడాకులు తీసుకునేంత వరకు... తానే తప్పు చేశానని పుకార్లు పుట్టించారని అడిగింది. విడాకుల సమయంలో తనకు అండగా నిలిచిన హీరో ధనుష్ తో తనకు సంబంధం ఉందంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపడింది. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి సహాయం చేస్తే, వారిద్దరి మధ్య ఏదో ఉన్నట్టేనా? అని ప్రశ్నించింది. ఎలాంటి సంబంధం లేకుండా ఒక అమ్మాయికి సహాయం చేయకూడదా? అని అడిగింది. ప్రతి విషయంలోనూ అమ్మాయిలనే టార్గెట్ చేస్తున్నారని... మగవాళ్లని మాత్రం ఏమీ అనరని చెప్పింది.

  • Loading...

More Telugu News