: ప్రొ.కోదండరాంపై మరోసారి మండిపడ్డ ఎంపీ బాల్క సుమన్


టీజేఏసీ ఛైర్మ‌న్ ప్రొ.కోదండ‌రాంపై టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ మ‌రోసారి మండిప‌డ్డారు. ఈ రోజు హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... రాజకీయ నిరుద్యోగులకు ఆశ్రయమిచ్చే నేతగా కోదండ‌రాం వ్యవహరిస్తున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన‌ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప‌థ‌కాల‌పై కోదండరాంతో పాటు ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సిగ్గుచేటని ఆయ‌న అన్నారు. మిషన్ కాకతీయ కాంట్రాక్టులను ఆంధ్రా వారికే అప్పగించారని అవాస్త‌వాలు ప‌లుకుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. తెలంగాణ‌ ప్రభుత్వం పాల‌న‌ పారదర్శకంగా ఉంద‌ని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News