: సమంత చేతికి ఉంగరం తొడిగి ముద్దాడిన నాగచైతన్య.. హైదరాబాద్‌లో ఘనంగా నిశ్చితార్థం
వెండితెర హీరోహీరోయిన్లు నాగచైతన్య, సమంతల నిశ్చితార్థం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఆదివారం రాత్రి ఎన్.కన్వెన్షన్‌లో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన బంధుమిత్రులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఆదివారం సమంత, చైల నిశ్చితార్థం జరుగుతుందని ఊహాగానాలు చక్కర్లు కొట్టినా నాగార్జున మాత్రం ఈ విషయాన్ని చివరి వరకు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. బంధుమిత్రుల సమక్షంలో సమంత, నాగచైతన్యలు ఒకరికొకరు ఉంగరాలు తొడుక్కున్నారు. సమంతకి ఉంగరం తొడిగిన అనంతరం సిగ్గులొలకబోస్తున్న ఆమెను చైతన్య ముద్దాడాడు. ఇప్పటికే నిశ్చితార్థమైన అఖిల్-శ్రియ భూపాల్ జోడీ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. త్వరలోనే చైతన్య, సమంతల పెళ్లి హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది.