: వరుసగా రెండు వికెట్లు తీసిన నెహ్రా!


టీమిండియా స్టార్ బౌలర్ ఆశిష్ నెహ్రా రెండు వరుస బంతుల్లో వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. నాగ్ పూర్ లోని విదర్భ స్టేడియంలో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో 144 పరుగులు చేసిన భారత జట్టు స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. సిరిస్ ఫలితాన్ని తేల్చే మ్యాచ్ లో ఓటమికి తావివ్వని విధంగా టీమిండియా ఆటగాళ్లు మైదానంలో కదులుతున్నారు. ఫీల్డింగ్ ను సెట్ చేసిన ధోనీ జూనియర్లకు సూచనలిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఫీల్డింగ్ లో యువ ఆటగాళ్లంతా మైదానంలో పాదరసంలా కదులుతూ బంతిని అడ్డుకుంటున్నారు. కొత్త బంతిని అందుకున్న చాహల్ తొలి ఓవర్ తో ఆకట్టుకున్నప్పటికీ మూడో ఓవర్ లో రెండు సిక్సర్లిచ్చి జట్టును ఆశ్చర్యపోయేలా చేశాడు. తరువాత బంతి అందుకున్న నెహ్రా వరుస బంతుల్లో ఓపెనర్లు బిల్లింగ్స్ (12), జాసన్ రాయ్ (10) లను పెవిలియన్ కు పంపి ఆకట్టుకున్నాడు. దీంతో 6 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. క్రీజులో మోర్గాన్ (9), రూట్ (5) ఉన్నారు. 

  • Loading...

More Telugu News