: దర్శకుడు కథను సమర్థవంతంగా చెప్పగలిగితే... స్క్రీన్ పై చూపించగలడు: హృతిక్ రోషన్
ఏ సినిమా దర్శకుడైనా కథను సమర్థవంతంగా వినిపించగలిగితే సగం విజయం సాధించినట్టని ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తెలిపాడు. కాబిల్ ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ, కాబిల్ అద్భుతమైన సినిమా అని అన్నాడు. ఇద్దరు అంధుల మధ్య జరిగే అందమైన ప్రేమకథ అని అన్నాడు. దర్శకుడు తన వద్దకు స్క్రిప్టు లేకుండా వచ్చాడని చెప్పాడు. అయినా సరే అద్భుతంగా కథ చెప్పాడని అన్నాడు.
ఇమేజ్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండవన్న సంగతి గుర్తుంచుకోవాలని చెప్పాడు. ఇమేజ్ కొన్ని విషయాల్లో సహాయం చేసినా, కథ విషయంలోకి వచ్చేసరికి ఇమేజ్ ను పట్టుకుని కూర్చుంటే మంచి కథలు చేయలేమని అన్నాడు. తాను నటుడ్ననని, అన్ని రకాల కథలు చేయాలని చెప్పాడు. తాను అదే పనిలో ఉన్నానని, స్క్రిప్టు డిమాండ్ మేరకు తాను నటిస్తానని, డాన్సులు లేవు, ఫైట్లు లేవు అని ఫిర్యాదులు చేయనని, దర్శకుడు ఏం చెబితే అదే చేస్తానని హృతిక్ తెలిపాడు.