: ట్రంప్ విద్వేషాన్ని చిమ్మిన వేళ... పెద్దమనసు చాటుకున్న కెనడా!
ముస్లింలపై విద్వేషాన్ని చిమ్ముతూ తమ దేశంలోకి ప్రవేశం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వేళ ఆ పక్కనే ఉన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడీ పెద్ద మనసు చాటుకున్నారు. మత విద్వేషానికి గురైన వారు, ఉగ్రవాదం లేదా యుద్ధోన్మాదం బాధితులుగా మారి సర్వం కోల్పోయిన వారు శరణార్థులుగా రావాలనుకుంటే నిరభ్యంతరంగా కెనడా రావచ్చని ట్రూడీ ప్రకటించారు. అలా వచ్చే వారికి తాము మనస్పూర్తిగా ఆహ్వానం పలుకుతామని ఆయన ట్వీట్ చేశారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. పలువురు ట్రంప్ ను విమర్శిస్తూ ట్రూడీ ను అభినందిస్తున్నారు.