: సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు తప్పు: నిర్మలా సీతారామన్


జల్లికట్టుపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు సరికాదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. చెన్నై పర్యటనకు వచ్చిన ఆమె, జల్లికట్టుపై తమిళులు అసంబద్ధ డిమాండ్ చేస్తున్నట్టు చెప్పడం తప్పని ఆయనకు స్పష్టం చేశామని అన్నారు. జల్లికట్టుకు కేంద్రమే సహకరించిందని గుర్తు చేస్తూ, కొందరు బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారని, ఆయన్ను అవమానించే వారు జాతి వ్యతిరేకులని విమర్శలు గుప్పించారు. తమ పార్టీ మొదటి నుంచీ జల్లికట్టుకు మద్దతిస్తోందని అన్నారు.

  • Loading...

More Telugu News