: క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదానికి.. నెహ్రూ విధానాల‌కు లంకె పెట్టిన కేంద్ర‌మంత్రి


భార‌త తొలి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ త‌ప్పిదాల వ‌ల్లే క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదం పురుడుపోసుకుందంటూ కేంద్ర‌మంత్రి జితేంద్ర‌సింగ్ ఆరోపించారు. క‌శ్మీర్‌లోని పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదానికి నెహ్రూనే కార‌ణ‌మ‌ని వ్యాఖ్యానించారు. క‌శ్మీర్ అంశాన్ని అప్ప‌టి హోంమంత్రి స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్‌ప‌టేల్‌కు వ‌దిలిపెట్టి ఉంటే ఉప‌ఖండ చ‌రిత్ర మ‌రోలా ఉండేద‌ని అన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదాన్ని అడ్డుకునే చ‌ర్య‌ల్లో భాగంగానే స‌ర్జిక‌ల్ దాడులు, పెద్ద నోట్ల ర‌ద్దు త‌దిత‌ర నిర్ణ‌యాలు తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు. నోట్ల ర‌ద్దు కార‌ణంగా ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు 60 శాతం త‌గ్గాయ‌న్నారు. అలాగే ఉగ్ర‌వాదుల‌కు పాక్ హ‌వాలా మార్గంలో అందిస్తున్న నిధులు 50 శాతం త‌గ్గిన‌ట్టు మంత్రి వివ‌రించారు.

  • Loading...

More Telugu News