: కొత్త కరెన్సీ నోట్ల డిజైన్ ఎప్పుడు ఆమోదించారో తెలుసా?


కొత్త కరెన్సీ నోట్ల డిజైన్ పై ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 8న  నోట్ల రద్దు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఓ టీవీ ఛానెల్ సమాచార హక్కు చట్టం కింద అసలు కొత్త నోట్ల డిజైన్ ఎప్పుడు ఆమోదించారని ప్రశ్నించింది. దీనికి సమాధానమిచ్చిన ఆర్బీఐ పాత నోట్ల రద్దుకు సరిగ్గా ఐదు నెలల ముందు అంటే జూన్ ఏడున కొత్త 2000, 500 రూపాయల డిజైన్ ను ఆమోదించినట్టు తెలిపింది. కాగా, వాస్తవానికి గతేడాది మే 19న కొత్త నోట్ల డిజైన్ ను ఆర్బీఐ ఆమోదించినట్టు, ఆ తరువాత కొన్నాళ్లకు కేంద్ర ప్రభుత్వం దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఆ ఛానెల్ వెల్లడించింది. ఇంకా ఈ కొత్త నోట్ల ముద్రణకు ఎంత సమయం పడుతుందన్న ప్రశ్నకు ఆర్బీఐ సమాధానం చెప్పకపోవడం విశేషం. 

  • Loading...

More Telugu News