: గాంధీ ఆసుపత్రి భవనం ఎక్కి కాంట్రాక్టు నర్సుల ఆందోళన.. కన్నీటి ఆవేదన
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కాంట్రాక్టు నర్సులు ఆందోళనకు దిగారు. తమ ఉద్యోగాలని రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తాము గతంలోనూ ఎన్నో ఆందోళనలు చేశామని, తమకు సానుకూలంగా హామీలు ఇచ్చిన అధికారులు అనంతరం వాటిని మర్చిపోయారని వారు మీడియాకు తెలిపారు. పోలీసులు తమని అరెస్టు చేస్తామని, కేసులు పెడతామని బెదిరిస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు. తాము ఎవరిపైనా దాడికి దిగలేదని అయినప్పటికీ తమపై కేసులు పెడతామంటున్నారని ఆవేదన చెందారు. తమని రెగ్యులరైజ్ చేసే వరకు విధుల్లోకి రామని తేల్చి చెప్పారు.