: ఆధునిక చరిత్రలో అతి పెద్ద కార్చిచ్చు.. కాలి బూడిదవుతున్న చిలీ నగరం!
చిలీ నగరం మంటల్లో కాలిపోతోంది. ఆధునిక చరిత్రలో అతి పెద్ద కార్చిచ్చు చెలరేగుతుండడంతో అక్కడి ప్రజలు తమ ప్రాంతాన్ని వదలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. మంటల్లో చిక్కుకుంటున్న చిలీ నగరంలోని అన్ని ప్రాంతాలు సర్వనాశనం అవుతున్నాయి. కార్చిచ్చుకి తోడు విసురుగా వీస్తున్న పెనుగాలుల ధాటికి ఆ ప్రాంతం అగ్నికి ఆహుతవుతోంది. ఇప్పటికే అక్కడి ప్రజలు మధ్య చిలీలోని ప్రాంతాలను విడిచారు. వేడిగాలులు, నల్లటి పొగ కారణంతో ఆ పట్టణానికి సమీపంగా కూడా ఎవ్వరూ ఉండలేని పరిస్థితి ఏర్పడింది. చిలీకి సాయం అందించేందుకు రంగంలోకి దిగిన రష్యా టన్నుల కొద్దీ నీటిని నిల్వచేసుకునే సామర్థ్యంగల సూపర్ ట్యాంకర్ విమానాన్ని పంపించి సహాయక చర్యల్లో పాల్గొంటోంది.