: ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వాటర్ ట్యాంక్ పై నుంచి దూకుతామని బెదిరించిన యువకులు
ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ పలువురు యువకులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగిన ఘటన కడప జిల్లా పులివెందుల రూరల్‌లో జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆయనకు మద్దతు తెలుపుతూ వైసీపీ విద్యార్థి సంఘం నాయకుల్లో కొందరు యువకులు తమ పార్టీ జెండాలను పట్టుకుని వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి ఈ విధంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని యువకులను ఎట్టకేలకు కిందికి దింపి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.