: తమిళనాడు వాసులకు పిలిచి ఉద్యోగాలిస్తున్న ఫ్లోరిడా... పాములను పట్టుకునేందుకేనట!


బర్మా జాతికి చెందిన కొండ చిలువలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి ప్రజలకు ఇబ్బందులు పెడుతున్న వేళ, అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడులోని పాములు పట్టే నిపుణులను ఏరి కోరి నియమించుకుంటోంది. తమిళనాడు అటవీ ప్రాంతాల్లో నివసించే ఇరులా తెగకు చెందిన ఇద్దరిని, వారు పెంచుకుంటున్న శునకాలను, వారి భాషను ఇంగ్లీషులోకి తర్జుమా చేయగల మరో ఇద్దరికి భారీ వేతనంగా ఇచ్చి ఫ్లోరిడా నియమించుకుంది. ఇప్పటివరకూ పాములను పట్టుకునే 13 మందిని ఇలా నియమించినట్టు తెలుస్తోంది. ఇరులా తెగకు చెందిన మాసీ సదయ్యన్, వడివేల్ గోపాల్ లకు 68,888 డాలర్లను వేతనంగా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. వీరు ఫ్లోరిడా బయాలజిస్టులతో కలసి పనిచేసి కొండచిలువలను బంధిస్తారని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News