: ట్రంప్ కు వ్యతిరేకంగా ఉద్యమించిన 'ట్రాన్స్ ఫార్మర్స్' హీరో షియా లాబ్యూఫ్ అరెస్ట్
గత వారంలో అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా ఉద్యమించిన హాలీవుడ్ హీరో, 'ట్రాన్స్ ఫార్మర్స్', 'అమెరికన్ హనీ' ఫేమ్ షియా లాబ్యూఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. "హి విల్ నాట్ డివైడ్ అజ్" అన్న నినాదంతో ప్రత్యక్ష నిరసన ఉద్యమానికి దిగిన ఆయనకు మద్దతుగా పెద్దఎత్తున ప్రజలు చేరడం, ఆపై న్యూయార్క్ మ్యూజియం ఎదుట ఘర్షణలు తలెత్తడంతో లాబ్యూఫ్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కాగా, ఓ ట్రంప్ అనుకూల వ్యక్తిపై దాడికి దిగినందునే లాబ్యూఫ్ ను అరెస్ట్ చేసినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. చట్ట విరుద్ధమైన నిరసనలు, దౌర్జన్యం చేయడం వంటి ఆరోపణలపై ఆయన్ను అరెస్ట్ చేసి, ఆపై విడుదల చేశామని, కేసు విచారణ నిమిత్తం ఏప్రిల్ 7న కోర్టుకు హాజరు కావాలని తాఖీదులిచ్చామని పోలీసులు తెలిపారు.