: ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు? బీజేపీ ఎక్కడ ఇబ్బంది పెట్టిందో చెప్పండి?: చంద్రబాబును అడిగిన పవన్


రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించడంలో చంద్రబాబునాయుడు ఎందుకు సర్దుకుపోవాల్సి వచ్చిందో ప్రజలకు తెలియజెప్పాలని పవన్ కోరారు. "మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారో నాకు చెప్పండి. ఏ బేసిస్ లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు? మిమ్మల్ని ఎవరు కాంప్రమైజ్ కావాలని చెప్పారో చెప్పండి. నాకు కాదు... మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసి అధికారంలో కూర్చోబెట్టారు. దయచేసి దీన్ని మీరు చెయ్యనప్పుడు రాజధానిని ఎలా నిర్మిస్తారు?" అని పవన్ అడిగారు. ప్రత్యేక హోదా అంశాన్ని పక్కనబెట్టి, ప్రత్యేక ప్యాకేజీ చాలని పదేపదే చెబుతూ, ప్రజలను మభ్య పెట్టాలని ఎందుకు చూస్తున్నారో వెంటనే తెలియజేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News