: రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు వైసీపీ పిలుపు


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదాను డిమాండ్ చేస్తూ విశాఖ‌ప‌ట్నంలో చేప‌ట్టిన శాంతియుత ఆందోళ‌న‌ను ప్ర‌భుత్వం అడ్డుకున్న నేప‌థ్యంలో రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్ర‌భుత్వ తీరుకి నిరసనగా, ప్రత్యేక హోదా సాధించే పోరాటంలో కొనసాగింపుగాను రేపు కూడా నిరసన చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన్ని మండల కేంద్రాల్లో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది.

  • Loading...

More Telugu News