: ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్, చంద్రబాబు
హైదరాబాదులోని రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం ప్రారంభమైంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. వారితోపాటు పలువురు మంత్రులు, వివిధ పార్టీల నేతలు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఒకేవేదికపై కేసీఆర్, బాబు కలవడంతో ఆ దృశ్యం అందర్నీ ఆకట్టుకుంది.