: ఈ రోజు మళ్లీ కలుసుకోనున్న చంద్రబాబు, కేసీఆర్!
ఇద్దరు చంద్రులు ఈ రోజు మరోసారి కలుసుకోనున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గవర్నర్ నరసింహన్ తన నివాసం రాజ్ భవన్ లో ఈ సాయంత్రం 'ఎట్ హోమ్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు ఇప్పటికే విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఎట్ హోమ్ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు పలువురు ఏపీ మంత్రులు హాజరుకానున్నారు.