: పవన్ ను చూసి ఎక్కువగా కంగారు పడుతున్న చంద్రబాబు!: రాంగోపాల్ వర్మ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల కన్నా, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను చూసి సీఎం చంద్రబాబు ఎక్కువ కంగారు పడుతున్నట్టు కనిపిస్తోందని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించాడు. చంద్రబాబు వైఖరి తనకు దిగ్భ్రాంతిని కలిగిస్తోందని అన్నాడు. ఏపీ కోసం పోరాడుతున్న పవన్ కల్యాణ్ ను చూసి ఆయన దారిలోనే నడవాలని కోరాడు. కాగా, గత రాత్రి నుంచి వరుసగా ట్వీట్లు పెట్టిన రాంగోపాల్ వర్మ, ప్రిన్స్ మహేష్ బాబును కూడా టార్గెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబుకు జల్లికట్టుపై ఉన్నంత ఆసక్తి ప్రత్యేక హోదాపై లేదని, హోదాకు మద్దతిస్తూ మహేష్ బాబు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించాడు.