: జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి!
ఢిల్లీ రాజ్ పథ్ లో గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా 21 శతఘ్నులు గర్జించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా యూఏఈ యువరాజ్ జాయేద్ హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు జాయేద్ తో కలసి రాష్ట్రపతి విచ్చేశారు. వీరికి ఉప రాష్ట్రపతి, ప్రధాని మోదీ, త్రివిధ దళాధిపతులు ఆహ్వానం పలికారు. ప్రస్తుతం రాష్ట్రపతి సైనిక వందనం స్వీకరిస్తున్నారు.