: అమర జవాన్లకు నివాళి అర్పించిన మోదీ
భారత అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళి అర్పించారు. ఢిల్లీలోని అమర జవాన్ల జ్యోతి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా భారత త్రివిధ దళాధిపతులు మోదీ వెంటే ఉన్నారు. అనంతరం, గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న రాజ్ పథ్ ప్రాంతానికి ఆయన తరలివెళ్లారు. అక్కడకు చేరుకున్న మోదీ... ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీకి స్వాగతం పలికారు. కాసేపట్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అక్కడకు చేరుకోనున్నారు.