: విశాఖలో మొదలైన అరెస్టుల పర్వం... తొలి టార్గెట్ వైకాపా నేతలే!
వైకాపా, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం తదితర విపక్ష పార్టీలతో పాటు యువత నేడు విశాఖపట్నంలో తలపెట్టిన హోదా నిరసనను అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసులు ముందస్తు అరెస్టులు ప్రారంభించారు. గత అర్ధరాత్రి నుంచి విశాఖ వైకాపా నేతల ఇళ్లముందు భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. రాత్రి 11:30 గంటల సమయంలో వైకాపా నేత పీ విజయచందర్ ను అరెస్ట్ చేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. మరింత మందిని హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. నేడు విశాఖలో తలపెట్టిన క్యాండిల్ ర్యాలీలో తాను స్వయంగా పాల్గొంటానని ఇప్పటికే వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.