: మార్చి తరువాత రూ. 100కే నెల రోజుల ఉచిత కాల్స్, నెట్: జియో ప్లాన్
తొలుత డిసెంబర్ వరకూ ఉచిత కాల్స్, డేటా ఆపై మార్చి 31 వరకూ అదే సౌకర్యాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుని కస్టమర్ల సంఖ్యను పెంచుకోవడంపైనే దృష్టిని సారించిన రిలయన్స్ జియో, మార్చి తరువాత కేవలం రూ. 100 అద్దెతో నెల రోజుల ఉచిత కాల్స్, డేటాను ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. జియో తరువాతి లక్ష్యం, కొత్తగా చేరిన కస్టమర్లు చెయ్యిదాటిపోకుండా చూసుకోవడమేనని, అందుకోసం సాధ్యమైనంత తక్కువ టారిఫ్ కు డేటా ప్లాన్ ను అందించనుందని 'ది ఎకనామిక్ టైమ్స్' పేర్కొంది. ఈ రూ. 100 ఆఫర్ జూన్ వరకూ కొనసాగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కాగా, గడచిన మూడు నెలల్లో 7.2 కోట్ల మంది కస్టమర్లు జియో చందాదారులుగా మారారని సంస్థ చీఫ్ ముఖేష్ అంబానీ వెల్లడించిన సంగతి తెలిసిందే.