: హోదాకు మద్దతుగా కదిలివస్తున్న టాలీవుడ్.. హింస కన్నా మౌన ప్రదర్శన మేలన్న రాజమౌళి.. పలువురు యువ హీరోల ట్వీట్లు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం విశాఖ సాగర తీరంలో యువత చేపట్టనున్న మౌన ప్రదర్శనకు మద్దతుగా టాలీవుడ్ ముందుకొస్తోంది. పలువురు యువహీరోలు మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు హీరో విష్ణు చేసిన వివాదాస్పద కామెంట్లపై కేసులు నమోదవుతున్నాయి. ప్రముఖ దర్శకుడు రాజమౌళి, హీరో రానా ప్రత్యేక హోదా డిమాండ్‌కు మద్దతు పలుకుతూ హింస కన్నా మౌన ప్రదర్శన మేలు అంటూ ట్వీట్లు చేశారు. సందీప్ కిషన్, తనీష్, సాయిధరమ్ తేజ్, సంపూర్ణేష్‌బాబులు కూడా మద్దతు ప్రకటించారు. దేశాన్ని రెండుగా విడగొట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హీరో విష్ణుపై హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌కు చెందిన ఆర్.మణిరత్నం అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.