: మార్కెట్లోకి విడుదలైన ‘టాటా మోటార్స్’ ఎలక్ట్రిక్ బస్సు
ప్రముఖ వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్ నుంచి పర్యావరణ రహిత బస్సులను ఈరోజు మార్కెట్లోకి విడుదల చేసింది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ బస్సులను విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ బస్సుల ధర రూ.1.6 కోట్ల నుంచి రూ.2 కోట్ల మధ్య ఉంటుందని పేర్కొంది. ఈ సందర్భంగా ‘టాటా మోటార్స్’ కమర్షియల్ వాహనాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్ర మాట్లాడుతూ, అవసరాలకు అనుగుణంగానే కాకుండా, పర్యావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాహనాలను తయారు చేస్తున్నామని అన్నారు. హైబ్రిడ్ బస్సులకు సంబంధించిన 25 వాహనాలను తయారు చేయాలని ఇప్పటికే తమకు ఆర్డర్ ఉందని, ప్రజా రవాణాకు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.