: ముద్రగడను చూసి చంద్రబాబు భయపడుతున్నారు: కాంగ్రెస్ నేత వీహెచ్
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను చూసి సీఎం చంద్రబాబునాయుడు భయపడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. హైదరాబాద్ లో విలేకరులతో ఈ రోజు ఆయన మాట్లాడుతూ, కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ముద్రగడను ఒంటరి చేసి, వారి ఉద్యమాన్ని నీరు గార్చాలని ఏపీ ప్రభుత్వం కుట్రకు పాల్పడుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాపు రిజర్వేషన్లు, ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా నిరసనలు తెలిపే అవకాశం అక్కడి ప్రజలకు ఇవ్వడం లేదని, ఏపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.