: మళ్లీ జట్టులోకి రాగలిగానంటే కారణం ద్రవిడ్: హార్డిక్ పాండ్య
ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి జాతీయ జట్టులోకి ఎంపికైన హార్డిక్ పాండ్య తాను మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేయడానికి కారణం రాహుల్ ద్రవిడ్ అని తెలిపాడు. రేపటి నుంచి ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన హార్డిక్ పాండ్య...2016లో పేలవ ప్రదర్శన కారణంగా జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యానని తెలిపాడు. దీంతో భారత్-ఏ జట్టుకు ఎంపికయ్యానని, తరువాత భారత్-ఏ తరపున ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లానని చెప్పాడు. ఈ సందర్భంగా తనకు ద్రవిడ్ మార్గదర్శకత్వం చేశాడని చెప్పాడు. తనలోని లోపాలు ఎత్తి చూపడంతో పాటు, వాటికి పరిష్కారాలు కూడా చూపించాడని, దీంతో తాను త్వరగానే టీమిండియాలో స్థానం సంపాదించానని అన్నాడు. తాను టీమిండియాలో స్థానం సంపాదించడం వెనుక క్రెడిట్ మొత్తం ద్రవిడ్ దేనని హార్డిక్ పాండ్య తెలిపాడు.