: పాఠశాల భవనం పై నుంచి దూకి పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
పాఠశాల భవనం పైనుంచి దూకి ఓ పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా తిరుపతి నగరం కపిల తీర్థంలో చోటు చేసుకుంది. అక్కడి నారాయణ స్కూల్లో పదో తరగతి విద్యార్థి మనోజ్‌కుమార్ ఈ ఘటనకు పాల్పడ్డాడు. రక్తపు మడుగులో పడి ఉన్న మనోజ్‌కుమార్‌ను వెంటనే స్విమ్స్‌కు తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. సదరు విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డ కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.